Home  »  TV News  »  శైలేంద్ర విలనిజం.. ఇక నుండి రిషిధార లకు కష్టమే!

Updated : May 4, 2023

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -753 లో.. రిషి కుర్చీ లో శైలేంద్ర కూర్చోవడంతో వసుధార బాధపడుతూ రిషిని తీసుకొచ్చి తన కుర్చీలో కూర్చో పెట్టి.. మీరు మాత్రమే ఈ కుర్చీలో కూర్చోవాలని అంటుంది. అన్నయ్య కూర్చున్నాడని ఫీల్ అవుతున్నావా అని రిషి అడుగుతాడు.. నా స్వార్థం అనుకోండి.. ఇంకేదైనా అనుకోండి.. ఈ కుర్చీ మీకు మాత్రమే.. ఇది మీ ప్రతిష్ట అని వసుధార అనగానే.. ఎప్పుడు సిచ్యువేషన్ ఒకేలా ఉండదు వసుధార.. అన్న మారొచ్చని రిషి అంటాడు. మీరు ఏంటీ సర్ ఆలా మాట్లాడుతున్నారని వసుధార అంటుంది. సరే సరే నీకు నచ్చినట్లే ఉంటాను హ్యాపీనా.. ఈ బ్రేస్లెట్ తో కట్టిపడేసావని చెప్పి వసుధారని దగ్గరికి తీసుకుంటాడు రిషి.

మరొకవైపు శైలేంద్ర అన్న మాటలు గుర్తుచేసుకుంటూ.. కావాలనే శైలేంద్ర అలా మాట్లాడాడు కదా అని మహేంద్రతో జగతి అంటుంది. అలా ఆలోచించకు జగతి.. అన్నయ్యలాగా శైలేంద్ర మంచివాడు.. వదినలా కాదని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ధరణి కిచెన్ లో వంట చేస్తుండగా.. వసుధార వెళ్లి ఎప్పుడు వంట గదిలోనే.. ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు.. అలా బయటకు వెళ్లి సరదాగా గడుపోచ్చు కదా అని అంటుంది. అంతలోనే శైలేంద్ర వచ్చి.. నేను అదే చెప్తాను.. మీరైనా తనకు నేర్పించొచ్చు కదా అని శైలేంద్ర అంటాడు. అవును ఇలాంటి విషయాలు నేను వసుధార దగ్గర నుండి నేర్చుకున్నాను.. ప్రేమ అంటే ఏంటో తన దగ్గర నుండే నేర్చుకున్నానని రిషి అంటాడు. అయితే ఇంకేంటి ధరణికి అన్ని నేర్పించు.. దానికి ఫీజు కూడా ఇస్తానని శైలేంద్ర అనగానే.. వసు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కాసేపటికి రిషి కూడా వెళ్ళిపోతాడు. మన మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నట్లు అందరికి తెలియాలా.. ఒక్కటి గుర్తు పెట్టుకో.. మన గురించి ఎవరికి తెలియద్దని ధరణి కి చెప్పి శైలేంద్ర.. అక్కడ నుండి వెళ్ళిపోతాడు. జగతి చాటుగా శైలేంద్ర మాటలు వింటుంది. ధరణి, శైలేంద్ర అన్న మాటలకు ఏడుస్తుంది. మరొకవైపు రిషి.. ఏంటి వసుధార ఈరోజు నాకు గుడ్ నైట్ చెప్పలేదని మెసేజ్ చేస్తాడు. నేను కోపంగా ఉన్నానని వసుధార రిప్లై ఇస్తుంది. మేడంకి కోపం ఎందుకు వచ్చిందోనని రిషి అంటాడు. నాకు ప్రేమ అంటే ఏంటో చెప్పింది మీరే.. కానీ మీ అన్నయ్య ముందు నేనే ప్రేమ అంటే ఏంటో చెప్పానని చెప్పారు అని వసుధార అంటుంది. మీరు పెద్ద చోర్.. పెళ్లి పీటల మీద నుండి చదువుకుందామని వచ్చిన నన్ను ప్రేమలో పడేసారని వసుధార అంటుంది. మళ్ళీ వసుధార వీడియో కాల్ చేసి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు.

మరుసటిరోజు ఉదయం అందరు కాలేజీకి వెళ్తారు. మెడికల్ కాలేజీకి సంబంధించిన విషయాలను‌ గురించి మాట్లాడుకుంటారు.  మనీకి సంబంధించినవి ఒక్కరే చూసుకోవాలని శైలేంద్ర అనగానే.. లేదు అన్నయ్య వసుధార నన్ను ఫాలో అప్ చేస్తుందని అంటాడు. మేం ఇద్దరం చూసుకున్నా కానీ ఒక్కరం చూసినట్లే అని శైలేంద్ర కు కౌంటర్ వేస్తుంది వసుధార.  మినిస్టర్ కాల్ చేసి రిషితో మాట్లాడుతాడు. మినిస్టర్ తో కాల్ మాట్లాడిన తర్వాత రిషి ఫ్రీ మెడికల్ ఎడ్యుకేషన్‌ గురించి అందరికి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.